Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్న కంపెనీలపై రతన్ టాటా అమితాసక్తి... ‘యువర్ స్టోరీ’లో పెట్టుబడి

టాటా గ్రూపు సంస్థల 'చైర్మన్ ఎమెరిటస్' రతన్ టాటా చిన్న కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సరికొత్త ప్రణాళికలతో రంగప్రవేశం చేసి మెరుగైన పనితీరు కనబరుస్తున్న స్టార్టప్ కంపెనీలు ఓలా, పేటీఎం, స్నాప్ డీల్, అర్బన్ లాడర్, బ్లూస్టోన్, కార్ దేఖో తదితర చిన్న కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన రతన్ టాటా, తాజాగా ‘యువర్ స్టోరీ’కి ఊతమిచ్చారు. స్టార్టప్ ప్రొఫైల్ స్టోరీలు, ఎంటర్ ప్రెన్యూర్ల విజయ గాథలను అందిస్తున్న ఈ ఆన్ లైన్ మీడియా సంస్థకు విశేషాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అయితే ఈ కంపెనీలో ఆయన ఎంతమేర పెట్టుబడి పెట్టారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.

More Telugu News